Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజు శాంసన్‌కు విలన్‌గా కేఎల్ రాహుల్.. రిషబ్ పంత్ కోలుకుంటే సరే..?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (13:21 IST)
Rishab_Sanju_Rahul
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకోని పక్షంలో కేరళ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను టీమిండియా వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోనున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. వన్డే ప్రపంచకప్‌లో సంజూని చేర్చే ఆలోచనలో బీసీసీఐ ఉంది. 
 
గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రకపోవచ్చునని క్రికెట్ వర్గాల అనుమానం ఏర్పడింది. అంతేగాకుండా.. వెస్టిండీస్ సిరీస్, ఆసియా కప్‌లో అతని ప్రదర్శన ఆధారంగా సంజూ ప్రపంచ కప్ జట్టులోకి తీసుకునే అవకాశం వుంది. 
 
గత డిసెంబర్‌లో రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్ నాటికి రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌గా ఉండే అవకాశం లేదు. ఈ స్థితిలో వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి సంజూ వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తాడు. ఒకవేళ సంజూని జట్టులోకి తీసుకున్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం లేదు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కూడా ప్రపంచకప్ జట్టులో ఉంటారు. వీరి తర్వాతే సంజూ ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడతాడు.
 
రిషబ్ పంత్ లేకపోవడంతో, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ స్థానాన్ని ప్రధానంగా పరిగణిస్తారు. దీంతో బ్యాటింగ్ స్థానానికి కేఎల్ రాహుల్‌ను తీసుకునే ఛాన్స్ వుంది. వన్డేల్లో మిడిలార్డర్‌లో రాణిస్తున్న రాహుల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చేందుకు సెలక్టర్లు సిద్ధంగా లేరు. రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా వస్తే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉండరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments