ధోని నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న నితిన్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (12:43 IST)
Nithin
నటుడు నితిన్ భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని నుండి ప్రత్యేక బహుమతిని అందుకున్నాడు. నితిన్‌కు దిగ్గజ క్రికెటర్ ధోనీ సంతకం చేసిన టీ-షర్ట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆటోగ్రాఫ్‌తో పాటు ధోనీ నటుడికి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇదే విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
 
"ఒక అసాధారణ వ్యక్తి నుండి అసాధారణ బహుమతి. దీనికి ధన్యవాదాలు MS ధోనీ సార్" అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, నితిన్ ధోనిని ఎప్పుడు, ఎలా కలిశాడు అని తెలుసుకోవాలని నెటిజన్లు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
నితిన్ తదుపరి చిత్రం వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో కనిపించనున్నాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత, నితిన్ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో ఒక ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. ఇందులోనూ శ్రీలీలనే హీరోయిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైతులకు రుణమాఫీ.. రోజుకు ఐదు సినిమా షోలు.. సీఎం విజయ్

నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments