Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ ఫైనల్ : రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్!

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (10:02 IST)
వరల్డ్ కప్ ఫైనల్ పోటీలో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మహా సంగ్రామంలో న్యూజిలాండ్ జట్టు తన రెండో వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 33 పరుగులు వద్ద ఉండగా, మ్యాక్స్‌వెల్ వేసిన అద్భుతమైన బంతి వికెట్లను గీరాటేసింది. దీంతో ఓపెనర్ గుప్తిల్ 15 వరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. 
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలిన విషయం తెల్సిందే. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి కివీస్ జట్టు కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ మెక్‌కల్లమ్ డకౌట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు ఒక్క పరుగు మాత్రమే. మెక్‌కల్లమ్ డకౌట్ కావడంతో కివీస్ క్రికెట్ అభిమానులు ఒక్కసారి పూర్తి నిరాశకు లోనయ్యారు. ప్రస్తుతం విలియమ్సన్, రాస్ టేలర్‌లు క్రీజ్‌లో ఉన్నారు. 

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments