Webdunia - Bharat's app for daily news and videos

Install App

#DhoniRetires ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ (Video)

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (18:19 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్ ధోనీ ఫ్యాన్సును కలవరపెడుతోంది. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో #DhoniRetires అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 
 
ధోనీ రిటైర్మెంట్‌పై ఇప్పటికే రకరకాలుగా వార్తలొచ్చిన నేపథ్యంలో.. వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు తర్వాత.. ధోనీ పూర్తిగా క్రికెట్‌కు దూరమవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ధోనీ వెస్టిండీస్‌ సిరీస్‌ సమయంలో దేశసేవ కోసమని సైన్యంలో చేరాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్లాడు. 
 
దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో ఉండలేదు. తాజాగా బంగ్లా సిరీస్‌కూ దూరంగానే ఉన్నాడు. ఇదే సమయంలో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం, మహీ భవితవ్యం గురించి చర్చిస్తానన్న నేపథ్యంలో ధోనీ రిటైర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌ ఉన్నట్టుండి.. ట్రెండింగ్‌లో వచ్చింది. 
 
మంగళవారం ఉదయం నుంచి ఇది టాప్‌-10లో ఉంది. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ హ్యాష్‌ట్యాగ్‌ నకిలీదని తెలయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఇలాంటి నకిలీ హ్యాష్‌ట్యాగ్‌లను ఆపేయాలని మహీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇంకా ధోనీకి మద్దతుగా హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ధోనీ రిటైర్మెంట్ కాడని, మీడియా ధోనీకి రిటైర్మెంట్ ఇప్పించాలనుకుంటుందా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments