Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై టెస్ట్ మ్యాచ్ : కివీస్ ముగింట 540 టార్గెట్

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (14:44 IST)
ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ముంగిట భారత్ 540 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడారు ఫలితంగా ఏడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేశారు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యంతో కలుపుకుని కివీస్ ముంగిట 540 పరుగులు ఉంచిది. 
 
భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అగర్వాల్ (62), పుజారా (47) చొప్పున పరుగులు చేసి తొలి వికెట్‌కు 107 పరుగులు చేశారు. ఆ తర్వాత గిల్ 47, కెప్టెన్ కోహ్లీ 36, అక్షర్ పటేల్ 26 బంతుల్లో 41 పరుగులు చేశారు. ముఖ్యంగా కివీస్ బౌలర్లను పటేల్ చీల్చిచెండాడు. 
 
మరోవైపు, కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్‌ మరోమారు రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ముంబై టెస్టులో అజాజ్ పటేల్ ఏకంగా 14 వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 540 పరుగుల విజయలక్ష్య ఛేదన కోసం కివీస్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

బీజేపీలోకి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. లాబీయింగ్ జరుగుతుందా?

తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదం.. లడ్డూ నాణ్యతపై కూడా దృష్టి

శపథాలు చేసి మరీ సగర్వంగా సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు - పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments