Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కరోనా వైరస్ రిపోర్టు వచ్చింది... ఫలితమిదే...

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (22:52 IST)
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షా ఫలితాలు గురువార రాత్రి వచ్చాయి. ఈ ఫలితాల్లో ధోనీకి నెగెటివ్ అని వచ్చింది. 
 
వచ్చే నెల 17వ తేదీ నుంచి ఐపీఎల్ పోటీలు యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ధోనీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రాంచీలోని సొంత ఫాం హౌస్‌లో ఉంటున్న ధోనీ నుంచి వైద్య సిబ్బంది శ్వాబ్ శాంపిల్స్ సేకరించారు. 
 
ఈ పరీక్షలో ధోనీకి కరోనా లేదని తేలింది. ఈ ఫలితంతో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలోనూ, అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ధోనీ శుక్రవారం చెన్నై వెళ్లి సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో జట్టుతో కలవనున్నాడు. 
 
సూపర్ కింగ్స్ జట్టు ఆగస్టు 21న యూఏఈ వెళ్లనుంది. ఈసారి ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు టోర్నీ జరగనుంది.
 
కాగా, ఐపీఎల్ పోటీల ప్రారంభానికి ముందు ఐపీఎల్‌లో కరోనా కలకలం చెలరేగిన విషయం తెల్సిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఫీల్డింగ్ కోచ్‌కు ఈ వైరస్ సోకింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారందరికీ ఈ పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments