Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట‌్‌కు గుడ్‌బై : మిస్బా ఉల్ హక్

Webdunia
సోమవారం, 27 జులై 2015 (09:25 IST)
పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు మిస్బా ఉల్ హక్ తన అంతర్జాతీయ క్రికెట్‌ భవిష్యత్‌ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వదేశంలో దాయాది దేశం భారత్‌తో సిరీస్ ఖాయమైతే ఆ సిరీస్ తర్వాత తాను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు 41 యేళ్ళ మిస్బా ప్రకటించారు. 
 
తన రిటైర్మెంట్‌పై మిస్బా స్పందిస్తూ తన కెరీర్ ఇంకెంతో కాలం కొనసాగదన్నారు. అయితే, ఇంకొన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. భారత్‌తో సిరీస్ గనుక స్వదేశంలో సిరీస్‌ ఓకే అయితే, ఆ సిరీస్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తానని ప్రకటించాడు. ఆ విధంగా భారత్‌తో సిరీసే తనకు చివరి సిరీస్ అవుతుందన్నాడు. 
 
కెరీర్లో 58 టెస్టులాడిన మిస్బా 48.19 సగటుతో 4000 పరుగులు చేయగా, వాటిలో 8 సెంచరీలు, 29 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేల విషయానికొస్తే 162 మ్యాచ్ లాడి 43.40 సగటుతో 5122 పరుగులు సాధించాడు. అయితే, వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఫిఫ్టీలు మాత్రం 42 ఉన్నాయి. టి20 క్రికెట్లో 39 మ్యాచ్ లాడిన ఈ వెటరన్ బ్యాట్స్ మన్ 788 పరుగులు చేశాడు. కాగా, మిస్బా ఇప్పటికే టి20, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments