Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్ టెస్ట్ : రహానే అద్భుత సెంచరీ - భారత్ 276*/5

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (12:27 IST)
భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే అద్భుతంగా రాణిస్తూ సెంచరీ చేశాడు. ఫలితంగా టీమిండియా 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. 
 
నిజానికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 195 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆతిథ్య జట్టు ఏ దశలోనూ కోలుకోలేకుండా పోయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్... ఐదు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
 
ఇందులో మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17 పరుగులకు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన అజింక్యా రహానె అద్భుతంగా రాణిస్తూ సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 12వ సెంచరీ కావడం గమనార్హం. మొత్తం 195 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో వంద పరుగులు చేశాడు. 
 
అంతకుముందు హనుమాన్ విహారి 21, రిషబ్ పంత్ 29 పరుగులు చేసి ఓటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానె 104, రవీంద్ర జడేజా 35 పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు తీశారు. లైయాన్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 276/5గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

తర్వాతి కథనం
Show comments