Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐకు ఎదురుదెబ్బ - రూ.550 కోట్లు చెల్లించండి : బాంబే హైకోర్టు

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (19:14 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ మాజీ ఫ్రాంచేజీ కొచ్చి టస్కర్స్ కేరళకు అనుకూలంగా వెలువడిన మధ్యవర్తిత్వ తీర్పును న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీకి రూ.538 కోట్లు చెల్లించాలని బీసీసీఐ ఆదేశిస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఈ వివాదం చాలా ఏళ్లుగా నడుస్తుండగా తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొచ్చి ఫ్రాంచైజీకి పెద్ద ఊరట లభించినట్టయింది. 
 
కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ ఐపీఎల్లో కేవలం ఒకే ఒక సీజన్ (2011) ఆడింది. ఒప్పందం ప్రకారం బ్యాంక్ గ్యారెంటీని సకాలంలో సమర్పించలేదన్న కారణంతో ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తూ 2011లో బీసీసీఐ ఈ ఫ్రాంచైజీని అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిపై కొచ్చి టస్కర్స్ యాజమాన్యం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. 
 
2015లో ఆర్బిట్రేటర్ జస్టిస్ లహోటి నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ కొచ్చి టస్కర్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసీపీఎల్ (కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్)కు రూ.384 కోట్లు, రెండెన్ జ్వాస్ స్పోర్ట్స్‌కు రెండెన్జౌస్ రూ.153 కోట్లు, మొత్తంగా సుమారు రూ.550 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును బీసీసీఐ బాంబే హైకోర్టులో సవాల్ చేసింది.
 
ఈ పిటిషన్‌‍పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు, మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం తమ పరిధి చాలా పరిమితమని స్పష్టం చేసింది. 'మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 కింద ఈ కోర్టు పరిధి చాలా తక్కువ. వివాదం యొక్క మెరిట్స్‌లోకి వెళ్లడానికి బీసీసీఐ చేస్తున్న ప్రయత్నం, చట్టంలోని సెక్షన్ 34లో ఉన్న నిబంధనల పరిధికి విరుద్ధం' అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. దీంతో ఆర్బిట్రేషన్ తీర్పును సమర్థిస్తూ కొచ్చి టస్కర్స్‌కు రూ.538 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

తర్వాతి కథనం
Show comments