Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని విమర్శించేముందు వెనక్కి తిరిగి చూసుకోండి: రవిశాస్త్రి

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు కోచ్ రవిశాస్త్రి మద్దతు పలికాడు. గురువారం నుంచి శ్రీలంకతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చే

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (09:27 IST)
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు కోచ్ రవిశాస్త్రి మద్దతు పలికాడు. గురువారం నుంచి శ్రీలంకతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో తొలి టెస్ట్ సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలో దేశానికి రెండు ప్రపంచ కప్‌లు సాధించిపెట్టిన ధోనీని విమర్శించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి తమ కెరీర్ చూసుకోవాలని చురకలంటించారు. 
 
జట్టుకు ధోనీ చేసిన సేవలు అమూల్యమైనవని.. దిగ్గజ ఆటగాడికి అండగా నిలవాల్సిన సమయం ఇదని తెలిపాడు. మైదానంలో ధోనీ కంటే మెరుగైన ఆటగాడ కనిపించడన్నాడు. బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా అతడి ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. 
 
కాగా ఇటీవల కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. టీ20కి ధోనీ ఆటతీరు సరిపోదని, ఈ ఫార్మాట్ నుంచి ధోనీ తప్పుకుని యువకులకు చోటిస్తే మంచిదని వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ వంటివారు సూచించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ధోనీకి కెప్టెన్ కోహ్లీ, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సహా పలువురు ధోనీకి మద్దతు పలికారు. ధోనీని విమర్శించిన వారిపై దుమ్మెత్తిపోశారు. తాజాగా ధోనీకి రవిశాస్త్రి అండగా నిలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

తర్వాతి కథనం
Show comments