Webdunia - Bharat's app for daily news and videos

Install App

1, 0, 0, 0, 0.. అలా వికెట్లు కూలిపోయాయ్.. సౌతాఫ్రికా కుదేలు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (22:00 IST)
India _South Africa
భారత్‌లో జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. మూడు ఓవర్లు పూర్తికాకుండానే ఐదు వికెట్లను దక్షిణాఫ్రికా కోల్పోయింది. బౌలింగ్ పరంగా టీమిండియా బౌలర్లు  అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్ మెరిశారు. 
 
కేవలం ఒక ఓవర్ లోనే అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ఒక వికెట్ మూడో ఓవర్‌లో మరో వికెట్ తీసుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ పెవిలియన్ దారి పట్టారు. 
 
ఈ క్రమంలో క్వింటన్ డికాక్ 1, కెప్టెన్ బవుమా 0, రిలీ రోసౌ 0, డేవిడ్ మిల్లర్ 0, స్టబ్స్ 0 పరుగులేమీతో పెవిలియన్ చేరారు. ఇలా వరుస పెట్టి అవుటవ్వడంతో దక్షిణాఫ్రికా పవర్ ప్లే పూర్తికాకుండానే పీకలోతు కష్టాలో పడింది. 
 
ఇలా తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు పడటంతో ఆతర్వాత దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ మార్కరామ్, పర్నీల్ ఆచీతూచీ ఆడుతున్నారు. 2.3 ఓవర్లలో 9 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

తర్వాతి కథనం
Show comments