Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు: 215 పరుగులకే టీమిండియా ఆలౌట్!

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (17:00 IST)
దక్షిణాఫ్రికాతో నాగ్‌పూర్‌లో జరుగుతున్న టెస్టులో భారత్ అతికష్టంమీద 215 పరుగులు సాధించింది. సఫారీల పేస్ బౌలింగ్ ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 215 పరుగులకే ఆలౌటైంది.

భారత బ్యాట్స్‌మెన్లలో మురళీ విజయ్ (40) ఓ మోస్తరుగా రాణించినా, శిఖర్ ధావన్ (12) పరుగులకే విఫలమయ్యాడు. తదనంతరం బరిలోకి దిగిన పుజారా (21), కెప్టెన్ కోహ్లీ (22) భారీ స్కోర్లు సాధించలేకపోయారు. అజింక్యా రెహానే (13), రోహిత్ (2) కూడా నిరాశపరిచారు. 
 
అనంతరం కీపర్ వృద్ధిమాన్ సాహా(32), రవీంద్ర జడేజా (34) రాణించారు. దీంతో టీమిండియా 200 మార్కు దాటింది. అనంతరం వచ్చిన అశ్విన్ (15), మిశ్రా (3) నిలకడగా ఆడినా హార్మర్, మోర్కెల్ బౌలింగ్ ధాటికి స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. తద్వారా భారత్ 215 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో అన్నీ వికెట్లు కోల్పోయింది.

సఫారీ బౌలర్లలో మోర్కెల్ మూడు వికెట్లు నేలకూల్చగా, హార్మర్ మూడు వికెట్లతో రాణించాడు. రబడా, ఎల్గర్, తహీర్‌లు తలా ఒక్కో వికెట్ పడగొట్టి టీమిండియా బ్యాట్స్‌మెన్లను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఫలితంగా 78.2 ఓవర్లలో 215 పరుగులకే భారత్ అవుటైంది.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments