ఐపీఎల్ 14 : కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (09:13 IST)
ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలు దుబాయ్ వేదికగా పోటాపోటీగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌‍కతా నైట్ రైడర్స్ జట్టు విజయభేరీ మోగించింది. తన ప్లే ఆఫ్స్‌‌‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో కోల్‌‌‌‌కతా నైట్‌ ‌‌‌రైడర్స్‌‌‌‌ జూలు విదిల్చింది. ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొడుతూ 86 రన్స్‌‌‌‌ భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌‌‌‌ను చిత్తు చేసింది.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కోల్‌‌‌‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) రాణించారు. తర్వాత రాజస్థాన్‌‌‌‌ 16.1 ఓవర్లలో 85 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. తెవాటియా (36 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. శివమ్​ మావికి ‘మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 
 
ఈ గెలుపుతో పాటు మెరుగైన రన్​రేట్​తో  కోల్‌‌‌‌కతా (14 పాయింట్లు) ప్లే ఆఫ్స్​ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌‌‌‌లో ముంబై 171 రన్స్‌‌‌‌ తేడాతో హైదరాబాద్‌‌‌‌పై గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌‌‌‌కు వెళుతుంది. లేదంటే కేకేఆర్​ ముందుకెళ్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

తిరుమలలో భారీ వర్షాలు.. పూర్తిగా నిండిపోయిన పాపవినాశనం, గోగర్భం జలాశయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

తర్వాతి కథనం
Show comments