Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్ టెస్ట్ : భారత్ 571 ఆలౌట్ - కోహ్లీ డబుల్ సెంచరీ మిస్

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (17:45 IST)
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాపై 91 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఇందులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీనే హైలెట్‌గా నిలిచింది. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు చాలా ఓపిగ్గా ఆడారు. ఫలితంగా భారత్ భారీ స్కోరు చేసింది. అయితే, కోహ్లీ మొత్తం 186 పరుగులు చేసి డబుల్ సెంచరీని చేజార్చుకుని 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 
 
అలాగే, సుధీర్ఘ కాలం తర్వాత కోహ్లీ చేసిన 28వ వ్యక్తిగత సెంచరీ. ఈయన 2019లో చివరిసారి సెంచరీ చేశాడు. 2019 నవంబరులో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ చివరిసారిగా సెంచరీ చేశాడు. కాగా, కోహ్లీ ఇప్పటివరకు చేసిన 27 సెంచరీల్లో ఎక్కువ బంతులు ఎదుర్కొని చేసిన రెండో సెంచరీ ఇదే. మొత్తం 241 పరుగులు ఫేస్‌ చేసి సెంచరీ చేశాడు. గత 2012-13లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 289 బంతులు ఎదుర్కొని కోహ్లీ సెంచరీ చేశాడు. ఇది 28వ టెస్ట్ సెంచరీ కాగా, మొత్తంగా 75వ ఇంటర్నేషనల్ సెంచరీ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

తర్వాతి కథనం
Show comments