Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎస్పీఎన్ లిస్ట్: కోహ్లీ ముందుకు.. ధోనీ వెనక్కి.. సానియాకు 41వ స్థానం!!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (09:31 IST)
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ.. కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఓవర్ టేక్ చేసాడు. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి కోహ్లీ అర్హుడని, వన్డే, ట్వంటీ-20 ఫార్మాట్‌ల నుంచి ధోనీ తప్పుకోవాలని విమర్శలొస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఈఎస్పీఎన్ విడుదల చేసిన టాప్-100 గ్లోబల్ స్పోర్ట్స్ పర్సన్ జాబితాలో కోహ్లీ 8వ స్థానంలో నిలిచాడు. ఇక మహేంద్ర సింగ్ ధోనీని 14వ స్థానంలో నిలిచాడు. 
 
క్రీడాకారుల సంపాదన, ఎండార్స్‌మెంట్‌, సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్, గూగుల్‌ శోధనలో ప్రాచుర్యాన్ని బట్టి ఈఎస్‌పీఎన్‌ ఈ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో భారత అగ్రశ్రేణి టెన్నిస్ తార, హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా 41వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇద్దరు క్రికెటర్లకు.. అదీ భారతీయ క్రికెటర్లే ఈ జాబితాలో స్థానం సంపాదించడం గమనార్హం. 
 
ఇంకా ఈ జాబితాలో 92 మంది పురుషులుండగా, 8 మంది మాత్రమే మహిళలు స్థానం దక్కించుకోగలిగారు. సాకర్‌ వీరుడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments