Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ ఆటగాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగించారు : ఆసీస్‌కు పీటర్సన్ వార్నింగ్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వార్నింగ్ ఇచ్చాడు. భారత పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్‌కు టీమిండియా ఆటగాళ్లు చుక్కలు చూపారని, అందువల్ల కంగారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాల

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:41 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వార్నింగ్ ఇచ్చాడు. భారత పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్‌కు టీమిండియా ఆటగాళ్లు చుక్కలు చూపారని, అందువల్ల కంగారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిక చేశాడు. 
 
ఈనెల 23వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది. దీనిపై పీటర్సన్‌ స్పందిస్తూ.. ‘వీలైనంత త్వరగా స్పిన్‌ ఆడటం నేర్చుకోండి. ఒకవేళ మీరు స్పిన్‌ ఆడలేకపోతే ఈ సిరీస్‌ కోసం భారత్‌‌కు వెళ్లొద్ద’ని కంగారూ టీమ్‌కు సూచించాడు. 
 
భారత్‌‌తో ఐదు టెస్టు సిరీస్‌లో స్పిన్‌ ట్రాక్‌లపై బోల్తాపడిన ఇంగ్లండ్‌ 0-4తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాబట్టి స్పిన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధపడే వెళ్లాలని ఆసీస్‌కు కేపీ సూచన చేస్తున్నాడు. 
 
'భారత్‌‌కు వెళ్తే ప్రాక్టీస్‌కు కొద్ది సమయమే లభిస్తుంది. అదేదో ఇక్కడే ప్రాక్టీస్‌ చేసుకోండి. స్పిన్‌ను ఎదుర్కొనేందుకు స్లో పిచ్‌లే ఉండాల్సిన పనిలేదు. ఎలాంటి వికెట్లపైనైనా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. స్పిన్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను ఎదుర్కోవడం ప్రాక్టీస్‌ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్‌ ఫుట్‌పై ఆడడం నేర్చుకోవాల్సి ఉంటుంద'ని పీటర్సన్‌ అన్నాడు.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments