Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా కోచింగ్ రేసులో ఆసీస్ మాజీ క్రికెటర్ లాంగర్‌ ఉన్నాడట!

Webdunia
సోమవారం, 18 మే 2015 (15:14 IST)
టీమిండియాకు కోచింగ్ రేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరల్డ్ కప్ తర్వాత జట్టు కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం కోచ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ పదవికి భారత మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. 
 
అయితే, ఈసారి కోచ్ పదవి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆ దేశ జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ కు దక్కనుందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కోచ్ పదవికి సరిపోయే మాజీ క్రికెటర్ ను వెతికే పనిలో బీసీసీఐ బిజీబిజీగా చర్చలు జరుపుతోంది. గతంలో లాంగర్ ఆసీస్‌కు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు కోచ్ గా ఉన్నారు. 
 
4 ఏళ్ల వయసున్న లాంగర్, 105 టెస్టులాడి 7,696 పరుగులు చేశాడు. అందులో 23 సెంచరీలు కూడా ఉన్నాయి. ఆటగాడిగా కంటే వ్యూహకర్తగా ఆయనకు మంచి పేరుంది. ఇదిలా ఉంటే, లాంగర్ తో పాటు ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ పేరును కూడా టీమిండియా కోచ్ పదవికి బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments