Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుమ్రా గాయం చిన్నదే... ఆందోళనక్కర్లేదు : బీసీసీఐ

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (14:54 IST)
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. బుమ్రా గాయం చిన్నదేనని, దానిపై ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొంది. ప్రస్తుతం స్వదేశంలో ఐపీఎల్ 12వ అంచె పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, ఢిల్లీ క్యాపిటల్, ముంబై ఇండియన్స్ జట్టలు మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో ముంబై ఇండియన్ బౌలర్‌గా ఉన్న బుమ్రాగా గాయపడ్డాడు. 
 
ఢిల్లీ ఇన్నింగ్స్‌ చివరి బంతి బౌలింగ్‌ చేశాక.. ఎదురుగా వస్తున్న బంతిని ఆపబోయి బుమ్రా కింద పడ్డాడు. బుమ్రా ఎడమ భుజంకి బలంగా గాయం కావడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానంలోనే పడుకున్నాడు. అనంతరం ఫిజియో వచ్చి చికిత్స చేసాడు. పెవిలియన్‌కు వెళ్లిన బుమ్రా .. ముంబై ఇన్నింగ్స్‌లో తొమ్మిదో వికెట్‌ పడ్డా కూడా బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడి గాయంపై అందరికి అనుమానాలు నెలకొన్నాయి.
 
ఈ నేపథ్యంలో బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందించారు. "బుమ్రా గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎడమ భుజానికి నిర్వహించిన వైద్య పరీక్షలలో గాయం చిన్నదేనని తేలింది. స్కానింగ్‌ రిపోర్ట్‌ కూడా మామూలుగానే ఉంది. బుమ్రా కోలుకున్నాడు. ముంబైకి విజయావకాశాలు లేకపోవడంతో.. ముందు జాగ్రత్తగా బుమ్రాను బ్యాటింగ్‌కు పంపలేదు" అని అధికారి చెప్పారు.
 
అయితే ముంబై ఇండియన్స్‌ జట్టు ఇప్పటికే బెంగళూరు చేరుకోగా.. బుమ్రా ఇంకా ముంబైలోనే ఎందుకు ఉన్నాడన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 'స్కానింగ్‌ రిపోర్ట్‌ వచ్చే వరకు ఆలస్యమైంది. అప్పటికే జట్టు బెంగళూరుకు బయలుదేరింది. బుమ్రా ఒక్కడే ప్రత్యేకంగా ప్రయాణం చేస్తాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌లో బుమ్రా ఆడతాడు' అని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments