వరల్డ్ కప్ హైఓల్టేజ్ మ్యాచ్‌- బిత్తరపోయిన బాబర్ ఆజామ్

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (17:25 IST)
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ సమరం ఆసక్తికరంగా జరుగుతోంది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ పాకిస్థాన్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ హైఓల్టేజ్ మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 
 
బౌలింగ్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి వికెట్లు రాబడుతున్నాడు. ఇప్పటికే రెండు కీలక వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ పేసర్.. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బతీశాడు. 
 
క్రాస్ సీమ్ డెలివరీతో పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(20)‌ను ఔట్ చేసిన సిరాజ్.. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(50) స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్‌స్టంప్ బెయిల్స్‌ను తాకేసింది. 
 
ఈ బాల్‌ను చూసి బాబర్ ఆజామ్ బిత్తరపోయాడు. అక్కడ్నించి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిప్పేశాడు. మొదట సాద్ షకీల్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత హార్డ్ హిట్టర్ ఇఫ్తికార్ అహ్మద్‌ను బౌల్డ్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments