Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు - పది పరుగులకే ఓ జట్టు ఆలౌట్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (09:04 IST)
పరుగుల వరద పారే టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయింది. 8.7 ఓవర్లలో ఈ పరుగులు చేసింది. జట్టులోని 11 మంది ఆటగాళ్లలో ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారంటే వారి ఆటతీరు ఏ విధంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. ఈ చెత్త రికార్డు ఐల్ ఆఫ్ మ్యాన్ - స్పెయిన్ జట్ల మధ్య నమోదైంది.
 
ఈ రెండు జట్ల మధ్య కార్గెజెనాలోని లా మంగా క్లబ్‌ బోటమ్‌ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. మరో ముగ్గురు ఆటగాళ్లు తలా రెండు పరుగులు చొప్పున చేశారు. జోసెఫ్ బరోస్ 4 పరుగులు చేశారు. దీంతో 10 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
స్పెయిన్ బౌలర్లలో లెఫ్టార్మ్ బౌలర్లు అతిఫ్ మొహమద్, మహ్మద్ కమ్రాన్‌లో చెరో నాలుగు వికెట్లు చొప్పున తీశారు. ఇందులో కమ్రాన్ ఖాతాలో హ్యాట్రిక్ కూడా ఉండటం గమనార్హం. ఆ తర్వాత 11 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్పెయిన్ జట్టు కేవలం 2 బంతుల్లో 11 పరుగులు చేసి విజయభేరీ మోగించింది. ఓపెనర్ అవైస్ అహ్మద్ ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. దీంతో 12 పరుగులు వచ్చాయి. ఫలితంగా పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments