Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ చేస్తారా?

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (13:39 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్నాడా? ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ట్వంటీ20 తర్వాత ఆయన తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు (టీ20)కు ముగింపు పలకాలన్న భావనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో ఎదురైన పరాజయం అనేక అనుభవాలు నేర్పిందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టు మేళవింపు దాదాపుగా కుదిరిందన్నారు. జట్టు 90-95 శాతం కుదురుకుంది. కొన్ని మార్పులు మాత్రమే జరుగుతాయి. ఆసియా కప్‌లో మేం కొన్ని ప్రయోగాలు చేయాలనుకున్నాం. ఈ టోర్నీకి ముందు నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం. రెండో స్పిన్నర్‌ ఆల్‌రౌండర్‌. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉంటే.. మూడో స్పిన్నర్‌ ఆల్‌రౌండర్‌ అయితే ఎలా ఉంటుందో చూడాలనుకున్నా. మేమిప్పటికీ సమాధానాల కోసం చూస్తున్నాం అని చెప్పారు. 
 
అలాగే, ఆసియాకప్‌లో పరాజయాలు తమకు చాలా పాఠాలు నేర్పాయని రోహిత్‌ చెప్పాడు. ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాను ఏడో స్థానంలో పంపడం, అసలు బౌలింగే ఇవ్వకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మాకు ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం ఉన్న మాట నిజమే. అయిదుగురినే వాడుకుంటే ఏం జరుగుతుందో, ఏం జరగదో చూడాలనుకున్నాం. ఈ రోజు హుడా ఉన్నాడు. కానీ లంక ఓపెనర్లు బాగా నిలదొక్కుకున్నారు. ఎటాకింగ్‌ స్పిన్నర్లు అశ్విన్‌, చాహల్‌ ద్వారా వికెట్లు సాధించాలనుకున్నాం. అందుకే హుడాకి బంతిని ఇవ్వాలనుకోలేదు అని వివరించాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

తర్వాతి కథనం
Show comments