Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి కూడా కోపం వస్తుంది.. వచ్చిందంటే భయంకరంగా వుంటుంది..

Webdunia
మంగళవారం, 12 మే 2020 (16:28 IST)
కెప్టెన్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా కోపం వస్తుందని మాజీ ఫేసర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ధోనీకి కోపం వస్తుందని.. ఆ కోపం చాలా భయంకరంగా వుంటుందని తెలిపాడు. 
 
2006-07 మధ్యకాలంలో ఓ సిరీస్‌కు సంబంధించి నెట్‌లో వార్మప్ చేస్తున్నామని... వార్మప్ తర్వాత ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే వార్మప్‌లో భాగంగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అందరూ ఎడం చేతివైపు, ఎండం చేతి బ్యాట్స్‌మెన్ అందరూ కుడిచేతి వైపు బ్యాటింగ్ చేయాలని రూల్ పెట్టుకున్నాం. రెండు జట్లుగా ఏర్పడ్డాం. ధోనీ బ్యాటింగ్‌కు దిగాడు. 
 
అయితే కొన్ని బంతులు ఆడిన తర్వాత ధోనీ అవుటైనట్లు అంపైర్ ప్రకటిచాడు. కానీ ధోనీ మాత్రం అది అవుటని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. అంతే ఒక్కసారిగా అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. చేతిలోని బ్యాట్ విసిరి కొట్టాడు. 
 
అక్కడనుంచి జరజరా నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయాడని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు కూడా ఆలస్యంగా వచ్చాడని పఠాన్ తెలిపాడు. ధోనీకి కోపం వస్తుందని ఆ కోపం కూడా భయంకరంగా వుంటుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

తర్వాతి కథనం
Show comments