Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు లేదా నవంబరులో ఐపీఎల్ 11వ సీజన్ : రాహుల్

Webdunia
గురువారం, 21 మే 2020 (16:19 IST)
దేశం వ్యాప్తంకా కరోనా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక అంతర్జాతీయ క్రీడా సంగ్రామాలు వాయిదాపడ్డాయి. అలాగే, స్వదేశంలో జరిగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ - ఐపీఎల్ 11వ అంచె పోటీలు కూడా వాయిదాపడ్డాయి. అయితే, ఈ పోటీల నిర్వహణపై బీసీసీఐ చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ స్పందించారు. 
 
దేశంలో దశల వారీగా లాక్డౌన్ ఆంక్షలను తొలగిస్తున్నారన్నారు. అందువల్ల ఐపీఎల్ పోటీలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ భ‌ద్ర‌త‌ను కోరుకుంటార‌ని, వారిని గౌర‌వించాల‌ని అన్నారు. క్రికెట్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
ఒక‌వేళ ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్‌కప్ వాయిదా ప‌డితే, అప్పుడు అక్టోబ‌ర్ లేదా నవంబ‌ర్‌లో ఐపీఎల్ నిర్వ‌హించే అవకాశాలు ఉన్న‌ట్లు చెప్పారు. ఐపీఎల్‌లో ఆడేందుకు అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్లు వ‌స్తుంటార‌ని, వారికి 14 రోజుల క్వారెంటైన్ అవ‌స‌రం ఉంటుంద‌ని, అలాంటి సంద‌ర్భంలో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను షెడ్యూల్ ప్ర‌కారం నిర్వ‌హించే క‌ష్ట‌మే అన్నారు. 
 
అంతేకాకుండా, ఐసీసీ క్యాలెండర్ ప్రకారం భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడాల్సిన క్రికెట్ సిరీస్‌లు వ‌ర్షాకా‌లం ముగిసాకే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు మ‌న ద‌గ్గ‌ర వ‌ర్షాకాలం ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే వరుణుడు అంతరాయం కల్పించే అవకాశం ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments