Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (12:16 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ పోటీలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్, ముగింపు మ్యాచ్‌లకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఐపీఎల్ సంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ సొంత వేదికలో టోర్నీ తొలి, ఆఖరి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. క్వాలిఫయర్ 2కు కూడా ఈడెన్ ఆతిథ్యమివ్వనుంది.
 
ఇక ప్లేఆఫ్స్ తొలి రెండు మ్యాచ్‌ల క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఈ నెలలోనే విడుదలవుతుందని భావిస్తున్నారు. గత యేడాదిలాగే 2025 ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు ఉంటాయి. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్ కోసం బీసీసీఐ నాలుగు వేదికలను ఖరారు చేసింది. ముంబై, బెంగళూరు, బరోడా, లక్నోలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 
 
వచ్చే సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఐసీసీ ప్రవర్తన నియమావళిని అనుసరించనుంది. 'ఇక నుంచి ఐపీఎల్లో ఐసీసీ ప్రవర్తన నియమావళిని అమలు చేస్తాం. ఇప్పటివరకు ఐపీఎల్ తన సొంత ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకుంది' అని ఓ ఐపీఎల్ పాలకవర్గ సభ్యుడు చెప్పాడు. 
 
గత ఏడాది ఐపీఎల్లో కోల్కతాను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈసారి పంజాబ్ కింగ్‌కు సారథ్యం వహించనున్నాడు. కేకేఆర్‌ను వీడి వేలంలోకి వెళ్లిన శ్రేయస్‌ను పంజాబ్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. అప్పుడే అతను పంజాబ్ కెప్టెన్ కాబోతున్నాడని అర్థమైంది. ఇప్పుడీ విషయాన్ని పంజాబ్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments