Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద పెద్ద మీసాలతో... న్యూ లుక్‌లో ఎంఎస్. ధోనీ

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (15:26 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ ఏ పని చేసినా అది సంచలనమే అవుతోంది. ఆయన వెంట్రుకలు పెంచినా, మీసాలు తీసేసినా, గుండు గీయించుకున్నా, మీసాలు పెంచినా ఇలా వ్యక్తిగతంగా ఏ పని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తాజాగా సరికొత్త లుక్‌లో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్ త‌ప్ప మ‌రో క్రీడా పోటీల్లో ఆడకుండా ఇంటిపట్టునే ఉంటున్న ధోనీ... ప్ర‌స్తుతం త‌న టైమంతా ఫ్యామిలీతోనే గ‌డుపుతున్నాడు. అయితే ధోనీలాంటి క్రికెట‌ర్లు ఆడినా ఆడ‌క‌పోయినా ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తుంటారు.
 
ఇపుడు కొత్త లుక్‌లో కనిపించారు. దీంతో మరోమారు వార్త‌లకెక్కారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో లాక్డౌన్ ఎత్తేసిన త‌ర్వాత ఫ్యామిలీతో క‌లిసి షిమ్లా వెళ్లిన ధోనీ ఈ కొత్త లుక్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. పెద్ద పెద్ద మీసాల‌తో అత‌డు పూర్తి డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. 
 
పైగా అక్క‌డి సాంప్ర‌దాయ టోపీ పెట్టుకొని క‌నిపించ‌డంతో ఆ ఫొటో మ‌రింత వైర‌ల్ అయింది. అత‌డు మీసాల‌తో క‌నిపించిన ఫొటోల‌ను మిస్ట‌ర్ కూల్ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments