Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-8: చెన్నై అదుర్స్: ర్యాంకింగ్స్‌లో రాత్రికి రాత్రే అగ్రస్థానానికి..!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (10:37 IST)
ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ విజపరంపరను కొనసాగిస్తోంది. నిన్నటిదాకా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ధోనీ సేన, రాత్రికి రాత్రే అగ్రస్థానంకి చేరింది. శనివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్ సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా నెట్ రన్ నెట్‌లోనూ అగ్రగామిగా నిలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ కూల్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా, మెక్ కల్లమ్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
 
కేవలం 44 బంతులను ఎదుర్కొన్న బ్రెండన్ ఏకంగా 66 పరుగులు రాబట్టాడు. కెప్టెన్ ధోనీ కూడా (41) అదే స్థాయిలో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ తర్వాత 193 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్, చెన్నై బౌలర్ల ధాటికి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మురళీ విజయ్ (34) మినహా పంజాబ్ బ్యాట్స్ మన్ మొత్తం విఫలమయ్యారు. దీంతో పంజాబ్ పై చెన్నై 97 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments