Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఇంజమామ్

Webdunia
గురువారం, 18 జులై 2019 (10:59 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత వివిధ క్రికెట్ జట్లకు చెందిన ప్రధాన కోచ్‌లతో పాటు చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ కోసం ఇప్పటికే బీసీసీఐ నోటిఫికేషన్ జారీచేసింది. అదేసమయంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ బాధ్యతల నుంచి ఇంజమామ్ ఉల్ హక్ కూడా వైదొలగారు. అయితే, పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదేశిస్తే మాత్రం తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని స్పష్టంచేశారు. 
 
నిజానికి ఈ నెల 30వ తేదీతో ఇంజమామ్ పదవీకాలం ముగియనుంది. చీఫ్ సెలక్టర్‌గా మూడేళ్లకు పైగా పనిచేసిన అతను.. తన ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేరు. అందుకే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 
 
అదేసమయంలో వచ్చే సెప్టెంబరు నెలలో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌, 2020లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో పీసీసీ కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. 
 
దీన్ని ముందుగానే గ్రహించిన హక్.. తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పీసీబీ ఛైర్మన్ ఎహ్‌సన్‌మణి, మేనేజింగ్ డైరెక్టర్ వసీమ్ ఖాన్‌తో వేర్వేరుగా మాట్లాడానని.. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపానన్నారు. ఏది ఏమైనప్పటికి అన్నీ పాక్ క్రికెట్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చేశానని.. అభిమానులు తనను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు ఇంజమామ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ విద్యా దినోత్సవం: 2025 ఏడాది థీమ్ ఏంటంటే?

అటవీ శాఖపై దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్

పెళ్లి పేరుతో వదినతో మరిది అక్రమ సంబంధం... బిడ్డకు జన్మనిచ్చాక...

తన ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి... ఎక్కడ?

చెన్నై మసాజ్ సెంటరులో వ్యభిచారం... పోలీసులు వెళ్లి చూడగా...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

తర్వాతి కథనం
Show comments