Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ డబుల్ సెంచరీ.. రెహానే శతకం : భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 557/5 రన్స్

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. 5 వికెట్లను కోల్పోయి 557 పరుగులు చేసి

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (16:23 IST)
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. 5 వికెట్లను కోల్పోయి 557 పరుగులు చేసిన స్థితిలో కెప్టెన్ కోహ్లీ డిక్లేర్డ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. 
 
అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ(211), రహానేలు(188) భారీ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రెండో రోజు ఆటలో 169 ఓవర్లు ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసి టీమిండియా కివీస్‌ను బ్యాటింగ్‌కు దింపింది. మరో మూడు రోజులు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
 
ఈ ఇన్నింగ్స్‌లో 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన స్థితిలో విరాట్ కోహ్లీకి జతగా అజింక్య రహానే వచ్చిన తర్వాత మూడో టెస్టు రెండో రోజు ఆటే మారిపోయింది. విరాట్ కోహ్లీ, రహానేలు 150 పరుగుల మైలురాయిని దాటేసి జట్టు స్కోరును ముందుకు సాగించారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీని దాటేశాడు. 
 
మొత్తం 347 బంతులాడిన కోహ్లీ 18 ఫోర్ల సాయంతో 200 పరుగులు చేసి.. తన వ్యక్తిగత స్కోరు 211 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత రహానే కూడా 188 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం జరిగింది. కివీస్ బౌలర్లలో జేఎస్ పటేల్‌కు 4 వికెట్లు దక్కగా, హెన్రీకి మూడు వికెట్లు లభించాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments