Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువతినే పెళ్లాడిన శివమ్ దూబే.. జస్ట్ మ్యారీడ్

Webdunia
శనివారం, 17 జులై 2021 (14:55 IST)
Shivam Dubey
భారత క్రికెట్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ప్రేమించిన యువతినే పెళ్లాడారు. ముంబై మోడల్ అజుమ్ ఖాన్ ను ప్రేమించిన శివమ్ దూబే ఓ ఇంటివాడయ్యాడు. వీరిద్దరి వివాహం కరోనా నిబంధనల అత్యంత నిరాడంబరంగా జరిగింది. కరోనా వల్ల అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు మధ్య ప్రేమికులిద్దరూ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. 
 
ప్రేయసిని పెళ్లాడిన శివమ్ దూబే తన వివాహం ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.'మేం ప్రేమ కంటే, ఎక్కువగా ప్రేమించుకున్నాం. ఇలా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది… జస్ట్ మ్యారీడ్' అంటూ పెళ్లి ఫోటోలను పోస్టు చేశాడు శివమ్ దూబే… అజుమ్ ఖాన్ ముస్లిం యువతి, శివమ్ దూబే హిందూ యువకుడు. దీంతో వీరిద్దరూ ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ రెండు మతాల సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. కాగా..భారీ అంచనాలతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన 28 ఏళ్ల శివమ్ దూబే, ఐపీఎల్‌లోను, టీమిండియాలో కూడా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.
 
భారత జట్టు తరుపున 13 టీ20 మ్యాచులు ఆడి 105 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీశాడు.శివమ్ దూబే ప్రియురాలు..ఇప్పుడు భార్య అయిన ముంబైలో మోడలింగ్ చేసే అజుమ్ ఖాన్ తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

తర్వాతి కథనం
Show comments