Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవీంద్ర జడేజా రెస్టారెంట్‌‌ జడ్జూస్ ఫుడ్ ఫీల్డ్‌కు కొత్త చిక్కు: ఫుడ్‌పై ఫంగస్.. నోటీసులు

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా గత ఏడాది డిసెంబరులో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా జడేజా తన సోదరితో కలిసి నిర్వహిస్తోన్న ఈ రెస్టారెంట్‌లో నాణ్యత ల

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (16:59 IST)
భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా  గత ఏడాది డిసెంబరులో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా జడేజా తన సోదరితో కలిసి నిర్వహిస్తోన్న ఈ రెస్టారెంట్‌లో నాణ్యత లేదంటూ వార్తల్లో నిలిచింది. రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు శుక్రవారం జడేజా రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు.
 
ఈ తనిఖీల్లో ఫ్రిజ్‌లో ఎక్కువ కాలంపాటు నిల్వ వుంచిన ఆహార పదార్థాలు, బేకరీ ఉత్పత్తులను కనుగొన్నారు. వీటిపై ఫంగస్ ఏర్పడటాన్ని కూడా గుర్తించారు. పరిమితికి మించి ఫుడ్‌ కలర్స్‌, అజినోమోటో వినియోగిస్తున్నట్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీఆర్‌ రాథోడ్‌ వెల్లడించారు. 
 
ఈ రెస్టారెంట్లో విక్రయానికి ఉంచిన ఉత్పత్తులపై గడువు తేదీ కూడా లేకపోవడం.. పాడైపోయిన కూరగాయలను గుర్తించిన సిబ్బంది వాటిని సీజ్ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పక్కనపెట్టి రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న జడేజా సోదరికి అధికారులు నోటీసులు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

తర్వాతి కథనం
Show comments