Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేతో తొలి వన్డే : భారత్ బ్యాటింగ్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (14:21 IST)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గురువారం తొలి వన్డే జరుగనుంది. హరారే వేదికగా జరిగే ఈ వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలింగ్‌కు తొలుత మొగ్గు చూపినట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపారు.
 
దీంతో జింబాబ్వే జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా మరుమని, ఇన్నోసెంట్ కైయా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను దీపక్ చాహర్ వేశాడు. తొలి ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. కైయా ఒక పరుగు చేయగా, మిగిలిన 5 రన్స్ లెగ్ బైస్ రూపంలో వచ్చాయి. ప్రస్తుతం తొలి 15 ఓవర్లు ముగిసే సమయానికి జింబాబ్వే జట్టు ఐదు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.
 
మరోవైపు, ఈ వన్డే కోసం ప్రకటించిన భారత జట్టులో ధావన్, గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్సర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకా హత్య కేసు : సీఎం చంద్రబాబును కలిసిన డాక్టర్ సునీత దంపతులు

దేశపు జనాభా గణనపై త్వరలోనే ప్రకటన చేస్తాం... అమిత్ షా

బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర... సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

బంగారుపల్లి తండాలో "కంటైనర్ స్కూల్".. ఆ స్కూల్ వారికే!

ఆంధ్రప్రదేశ్ గ్రామసభకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

వినోదం కోసం మ్యాడ్ మ్యాక్స్ స్క్వేర్ రాబోతుంది

పడక సీన్లలో నటించడం అంత ఈజీ కాదు : మాళవికా మోహనన్

తర్వాతి కథనం
Show comments