INDvsWI, 2nd T20I..టీమిండియా ఓడినా.. కోహ్లీ, రోహిత్ రికార్డ్

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (13:21 IST)
ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది. దీంతో భారత్ పరాజయం పాలైంది.
 
టీమిండియా ఓటమిని చవిచూసినా.. భారత క్రికెటర్లు మాత్రం రికార్డుల పంట పండించారు. తిరువనంతపురంలో వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ(2563) ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పొడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 19 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు.
 
అలాగే రోహిత్‌ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇద్దరి మధ్య కేవలం ఒక్క పరుగు మాత్రమే వ్యత్యాసంగా ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ, రోహిత్‌లు ఉన్నారు. 
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన రికార్డుని మిస్సయ్యాడు. మరో ఆరు పరుగులు చేసి ఉంటే, స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. ఇప్పటివరకు టీ20ల్లో స్వదేశంలో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లలో మార్టిన్‌ గప్తిల్‌ (1430), కోలిన్‌ మన్రో (1000)లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - మావోయిస్టుల హతం

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి: తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు

Exit polls, జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

తర్వాతి కథనం
Show comments