Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో టి20 సిరీస్‌.. రెండో టీ-20లో భారత్ ఘనవిజయం

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (14:52 IST)
శ్రీలంకతో టి20 సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా మంగళవారం నాడు జరిగిన రెండో టి20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ శ్రీలంకను నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకు పరిమితం చేసింది. 
 
టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. దూకుడుగా ఆడుతున్న ఆవిష్క ఫెర్నాండోను సుందర్ బోల్తా కొట్టించడంతో శ్రీలంక వికెట్ల పతనం ప్రారంభమైంది. అయితే కుశాల్ పెరెరా 34 పరుగులతో కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి లాంగ్ ఆన్‌లో ఫీల్డర్‌కు దొరికిపోవడంతో అతని పోరాటం ముగిసింది. 
 
ఇక అక్కడి నుండి శ్రీలంక  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే చివరి ఓవర్‌లో హసరంగా చివరి మూడు బంతులను బౌండరీలకు తరలించడంతో లంక ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.  
 
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, నవదీప్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు. 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. 17.3 ఓవర్లలో  మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

తర్వాతి కథనం
Show comments