శ్రీలంకతో మ్యాచ్.. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం

Webdunia
ఆదివారం, 7 జులై 2019 (11:17 IST)
ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లీగ్ స్టేజిలో ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించిన కోహ్లీసేన 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
 
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఓపెనర్లు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్‌ శర్మ 94 బంతుల్లో 103(14 ఫోర్లు, 2 సిక్సులు), కేఎల్‌ రాహుల్‌ 118బంతుల్లో 111(11 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీలతో చెలరేగారు.
 
ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ 41 బంతుల్లో 34నాటౌట్‌(3 ఫోర్లు), హార్దిక్ పాండ్య(7నాటౌట్‌)తో కలిసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ, కసున్ రజిత, ఇసురు ఉదానాలు తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments