Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్రాంతి పేరుతో యువరాజ్‌ ఔట్... నెక్ట్స్ టార్గెట్ ధోనీయేనా?

భారత క్రికెట్ జట్టు నుంచి యువరాజ్ సింగ్‌ను తప్పించారు. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు జట్టుకు దూరంగా ఉంచారు. ఇది ధోనీపై ఒత్తిడిని మ‌రింత పెంచింది. టీమ్‌లో సీనియ‌ర్ మోస్ట్ ప్లేయ‌ర్స్ అయిన ఈ ఇద్ద‌రిపై ఏదో

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (13:43 IST)
భారత క్రికెట్ జట్టు నుంచి యువరాజ్ సింగ్‌ను తప్పించారు. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు జట్టుకు దూరంగా ఉంచారు. ఇది ధోనీపై ఒత్తిడిని మ‌రింత పెంచింది. టీమ్‌లో సీనియ‌ర్ మోస్ట్ ప్లేయ‌ర్స్ అయిన ఈ ఇద్ద‌రిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌న్న ఒత్తిడి అటు బోర్డు, ఇటు సెల‌క్ట‌ర్ల‌పై పెరుగుతున్న నేప‌థ్యంలో ఎమ్మెస్కే ప్ర‌సాద్ అండ్ టీమ్ ఒక‌రిని త‌ప్పించేసింది.
 
అంతేకాదు ధోనీ 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ర‌కు ఉంటాడా? అని అడిగితే.. ఇప్పుడే ఏమీ చెప్ప‌లేమ‌ని ఎమ్మెస్కే తమ ఉద్దేశాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు. చూద్దాం.. చూద్దాం.. అత‌నో లెజెండ్‌. అత‌ని గురించి విష‌యాలు ప‌బ్లిగ్గా చెప్ప‌లేం. కానీ ధోనీ కోసం ఓ ప్లాన్ ఉంది అని అత‌ను స్ప‌ష్టంచేశాడు. టీమ్ ఎంపిక అన‌గానే ధోనీ ఇక ఏమాత్రం ఆటోమెటిక్ చాయిస్ కాద‌ని కూడా ఎమ్మెస్కే అన్నాడు. 
 
యువీని తొల‌గించ‌డంపై మ‌రో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ప్ర‌సాద్‌. వ‌రల్డ్‌క‌ప్ వ‌ర‌కు కొత్త రొటేష‌న్ పాల‌సీని అనుస‌రించ‌నున్న‌ట్లు అత‌ను చెప్పాడు. ఇప్ప‌టికే 25 మంది ప్లేయ‌ర్స్‌ను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించాడు. అదేస‌మ‌యంలో చాంపియ‌న్స్ ట్రోఫీలో టీమిండియా ఫిట్నెస్‌, ఫీల్డింగ్ ఆశించిన‌ట్లుగా లేద‌ని అన్న ప్ర‌సాద్‌.. ప‌రోక్షంగా యువీని తొల‌గించ‌డానికి మ‌రో కార‌ణాన్ని కూడా చెప్పాడు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments