Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ టెస్ట్ : ధీటుగా బదులిచ్చిన లంకేయులు... 356/9

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 356 ప‌రుగులు చేసింది.

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (17:26 IST)
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 356 ప‌రుగులు చేసింది. భార‌త్ కంటే ఇంకా 180 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 131/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక‌ను మ‌థ్యూస్ (111), చండీమాల్ (147-నాటౌట్) ఆదుకున్నారు. 
 
మ‌థ్యూస్ ఔటైన త‌ర్వాత లాస్ట్ సెష‌న్‌లో శ్రీలంక వికెట్లు వెంటవెంటనే లాస్ట్ 15 ఓవ‌ర్లలోనే 5 వికెట్లు కోల్పోయింది. అయితే బ్యాడ్ లైట్ కార‌ణంగా 5 ఓవ‌ర్లు ముందే మ్యాచ్‌ను ముగించ‌డంతో శ్రీలంక ఆలౌట్ నుంచి త‌ప్పించుకుంది. భార‌త్ బౌల‌ర్ల‌లో అశ్విన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ష‌మీ, ఇశాంత్, జ‌డేజా తలా 2 వికెట్లు తీసుకున్నారు.  
 
అంతకుముందు, భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌‌ను 536/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, సొంతగడ్డపై ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ద్విశతకంతో చెలరేగిపోయాడు. ఏకంగా 234 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా ఇది కోహ్లీకి ఆరో డబుల్ సెంచరీ. దీంతో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments