Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రేయాస్ అయ్యర్ సెంచరీ - రెండో వన్డే‌లో భారత్ విజయం

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (23:18 IST)
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయభేరీ మోగించింది. భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో ఈ విజయం సాధించింది. ఆదివారం జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారత జట్టు 25 బంతులు మిగిలి ఉండ‌గానే ఏడు వికెట్ల తేడాతో 282 ప‌రుగులు చేధించి విజ‌యం సాధించింది. 
 
మ్యాచ్ పూర్త‌య్యే స‌మ‌యానికి శ్రేయ‌స్ అయ్య‌ర్ 113, సంజూ శామ్‌స‌న్ 30 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు బ్జోర్ ఫార్టౌన్‌, వాయ్‌నే పార్నెల్‌, క‌గిసో ర‌బ‌డా ఒక్కో వికెట్ తీసుకున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన 279 పరుగులు చేసింది. సౌతాఫ్రికాలో ఆటగాళ్లలో అడెన్ మార్‌క్రమ్ 79, రీజా హెండ్రిక్స్ 74 ప‌రుగులు చేసినా ఉప‌యోగం లేక‌పోయింది.
 
ఆ తర్వాత 279 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీం ఇండియా ఓపెన‌ర్లు శిఖార్ ధావ‌న్ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్ గిల్‌‌లు నిరాశపరిచినప్పటికీ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిషాన్ నిల‌క‌డ‌గా.. ఆచితూచీ ఆడుతూ.. వీలు చిక్కిన‌ప్పుడు బ్యాట్ ఝుళిపించారు. 
 
భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ 13, శుభమన్ గిల్ 28, ఇషాన్ కిషన్ 93, శ్రేయాస్ అయ్యర్ 113 (నాటౌట్), శాంసన్ 30 చొప్పున పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

తర్వాతి కథనం
Show comments