Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టీ20... జట్టులోకి సురేష్ రైనా

సౌతాఫ్రికా గడ్డపై భారత క్రికెట్ జట్టు పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్‌లు ముగిశాయి. దీంత ఈ పర్యటన ఇపుడు తుది అంకానికి చేరుకుంది. ఇందులోభాగంగా, తొలి ట్వంటీ20 మ్యాచ్ జొహానెస్‌బర్గ్‌ వ

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (10:46 IST)
సౌతాఫ్రికా గడ్డపై భారత క్రికెట్ జట్టు పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్‌లు ముగిశాయి. దీంత ఈ పర్యటన ఇపుడు తుది అంకానికి చేరుకుంది. ఇందులోభాగంగా, తొలి ట్వంటీ20 మ్యాచ్ జొహానెస్‌బర్గ్‌ వేదికగా ఆదివారం జరుగనుంది. 
 
వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టును చితక్కొట్టేసిన భారత్‌ రెట్టించిన విశ్వాసంతో సిద్ధమవుతుండగా.. పరాభవాన్ని మరిచి పుంజుకోవాలని దక్షిణఫ్రికా కోరుకుంటోంది. కొత్త ఆటగాళ్లతో నిండిన ఆతిథ్య జట్టు ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం
 
ముఖ్యంగా, టి20ల్లోనూ తమ స్థాయికి తగినట్లుగా సత్తా చాటితే సఫారీ టూర్‌ చిరస్మరణీయంగా నిలిచిపోవడం ఖాయం. ఈ క్రమంలో ఆదివారం భారత్, సౌతాఫ్రికా మధ్య వాండరర్స్‌ మైదానంలో తొలి టి20 మ్యాచ్‌ జరుగనుంది. వన్డే సిరీస్‌ గెలిచిన జట్టునే ఇక్కడా భారత్‌ కొనసాగించే అవకాశం ఉంది. అయితే టి20 సిరీస్‌ కోసమే ముగ్గురు ఆటగాళ్లు సురేశ్‌ రైనా, కేఎల్‌ రాహుల్, జైదేవ్‌ ఉనాద్కట్‌ దక్షిణాఫ్రికాకు వచ్చారు. వీరిలో రైనాకు మాత్రం చోటు ఖాయంగా కనిపిస్తోంది. 
 
యేడాది తర్వాత అతను భారత్‌ తరపున మ్యాచ్‌ ఆడబోతున్నాడు. రోహిత్, ధావన్, కోహ్లిలతో టాపార్డర్‌ తిరుగులేని విధంగా ఉంది. వన్డేల్లో పెవిలియన్‌కే పరిమితమైన మనీశ్‌ పాండేకు ఈ సారైనా అవకాశం లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ధోనీ టి20 మెరుపులు చూపించి చాలా కాలమైంది. వన్డేల్లో పెద్దగా అవకాశం లభించని అతను ఫినిషర్‌గా తనకున్న గుర్తింపును మళ్లీ ప్రదర్శించాలంటే ఈ ఫార్మాట్‌ సరైన వేదిక. 
 
ఇక పాండ్యా కూడా బ్యాటింగ్‌లో చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌ పరంగా టీమిండియా అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో సఫారీల పని పట్టిన నలుగురు మళ్లీ అదే తరహాలో ప్రత్యర్థిని చుట్టేయగల సమర్థులు. పేస్‌లో భువనేశ్వర్, బుమ్రా… స్పిన్‌లో చహల్, కుల్దీప్‌ల మంత్రం మళ్లీ పని చేస్తే ఈ సిరీస్‌ కూడా మన ఖాతాలో చేరుతుంది.
 
 
తుది జట్లు (అంచనా): భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే/రైనా, ధోని, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ 
 
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్‌, జాన్‌-జాన్‌ స్మట్స్‌, డివిలియర్స్‌, డుమిని, మిల్లర్‌/బెహర్డీన్‌, క్లాసన్‌, క్రిస్‌ మోరిస్‌, ఫెలుక్వాయో, జూనియర్‌ దలా, డేన్‌  ప్యాటర్సన్‌, ఫాంగిసో.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments