Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ తప్పులపై తప్పులు చేసింది.. సలహా ఇవ్వడం మానేశా : వసీం అక్రమ్

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (15:02 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు తప్పులపై తప్పులు చేస్తోందని, అందువల్ల ఆ జట్టుకు సలహాలు ఇవ్వడం మానేశానని పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజండ్రీ క్రికెటర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం మాంచెష్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత క్రికెట్ జట్టు ఓడించింది. 
 
దీనిపై వసీం అక్రమ్ స్పందిస్తూ, పాక్ జ‌ట్టుకు స‌ల‌హాలు ఇచ్చి ఇచ్చి అల‌సిపోయాన‌న్నాడు. మాంచెస్ట‌ర్‌లో భార‌త్‌పై పాక్ ఓడిన చాలా బాధాకరమన్నారు. అసలు ఈ మ్యాచ్ కోసం అయిదుగురు స్పెష‌లిస్టు బౌల‌ర్ల‌తో మ్యాచ్‌కు వెళ్తున్న‌ప్పుడే.. టాస్ గెలిచిన త‌ర్వాత ఎలా బౌలింగ్‌ను తీసుకున్నార‌ని వ‌సీం ప్ర‌శ్నించాడు. 
 
మాంచెస్ట‌ర్ వ‌న్డేలో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్‌.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ భారీ స్కోర్ చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో పాక్ అయిదుగురు స్పెష‌లిస్టు బౌల‌ర్ల‌తో బ‌రిలోకి దిగింది. పాక్ చేస్తున్న త‌ప్పుల‌ను చూసి ఆ జ‌ట్టును విమ‌ర్శించ‌డం మానేసిన‌ట్లు చెప్పాడు. 
 
అయిదుగురు బౌల‌ర్లు ఉన్నారంటే, ఓ స్పెష‌లిస్టు బ్యాట్స్‌మెన్‌ను మ‌నం మిస్స‌వుతున్నామ‌న్న‌ట్లే, అలాంటి స‌మ‌యంలో బౌలింగే మ‌న బ‌లం, అప్పుడు మ‌నం టార్గెట్ ఇచ్చి డిఫెండ్ చేయాల‌న్నాడు. ఇలాంటి స‌ల‌హాలు ముందు నుంచే ఇచ్చాన‌ని, కానీ పాక్ జ‌ట్టు త‌న స‌ల‌హాల‌ను స్వీక‌రించ‌లేద‌ని, అందుకే సలహాలు ఇవ్వడం మానేసినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments