Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ : పాకిస్థాన్ టార్గెట్ 182

pak batsmens
Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (21:39 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం సూపర్-4 మ్యాచ్‌లో దాయాది దేశాలైన పాకిస్థాన్, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తద్వారా పాకిస్థాన్ ముంగిట 182 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 28 (20 బంతులు 1 ఫోరు, 6 సిక్సర్లు), కేఎల్ రాహుల్ 28 (16 బంతులు 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 10 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 13, రిషభ్ పంత్ 12 బంతుల్లో 14 రన్స్, దీపక్ హుడా 14 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 రన్స్, రవి బిష్ణోయ్ 2 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 8 చొప్పున పరుగులు చేశారు. 
 
లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై చెలరేగిన హార్దిక్ పాండ్యా 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. పాక్ బౌలర్లలో షదాబ్ ఖాన్ 2, నసీం షా, హుస్నైన్, రౌఫ్, నవాజ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. విరాట్ కోహ్లీ వికెట్‌ను రనౌట్ రూపంలో పడగొట్టారు. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో స్వల్ప మార్పులుచేసింది భారత తుది జట్టుకు ఎంపిక చేసినవారిలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హూడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్‌లు ఉన్నారు. 
 
అలాగే, పాకిస్థాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్, ఫక్తర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, మహ్మద్ హోస్నైన్, నజీం షాలకు తుది జట్టులో చోటు కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments