Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా ట్వంటీ20 మ్యాచ్ : 184 రన్స్ చేసిన భారత్ - కివీస్ ముంగిట భారీ లక్ష్యం

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (20:55 IST)
కోల్‌కతా వేదికగా పర్యాటక న్యూజిలాంజ్ జట్టుతో జరుగుతున్న మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో కివీస్ ముంగిట 185 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి అర్థ సెంచరీ చేశాడు. మొత్తం 31 బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఐదు ఫోర్లు, మూడు ఫోర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. 
 
ఇలాగే, మరో ఓపెనర్ ఇషాన్ ఖాన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేష్ అయ్యర్ 20, హర్షల్ పటేల్ 18, దీపక్ చాహర్ 21 చొప్పున పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా, రిషభ్ పంత్ 4, అక్సర్ 2 చొప్పున మాత్రమే రన్స్ చేశారు. కివీస్ బౌలర్లలో మిచెల్ మూడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీయగా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఫెర్గ్యూసన్, సోథిలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు మూడు ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, చివరి టీ20 మ్యాచ్ ఆదివారం కోల్‌కతా వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్ శర్మ సేన... ఇపుడు చివరి ట్వంటీ20లోనూ గెలుపొంది సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్... తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఓపెనర్ రాహుల్, స్పిన్నర్ అశ్విన్‌కు విశ్రాంతి నివ్వగా, వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్‌కు చోటు కల్పించారు. 
 
అలాగే, కివీస్ జట్టులో కూడా ఒక మార్పు చేశారు. ఆ జట్టు సారథి పేసర్ టిమ్ సౌథీ ఈ మ్యాచ్‌కు దూరంకాగా, స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments