Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ సూపర్ ఓవర్.. టీమిండియాదే గెలుపు.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డ్ (video)

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (17:11 IST)
భారత్-కివీస్‌ల మధ్య జరిగిన నాలుగో ట్వంటీ-20లోనూ భారత్ సూపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ కూడా మూడో టీ-20 తరహాలో ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. సూపర్ ఓవర్ ప్రకారమే ఈ మ్యాచ్ ఫలితాన్ని కూడా నిర్ణయించారు. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లగా కెఎల్ రాహుల్, కోహ్లి బరిలోకి దిగారు. టిమ్ సౌథీ బౌలింగ్ వేశాడు.
 
రాహుల్ తొలి రెండు బంతులను సిక్స్ అండ్ ఫోర్‌గా మలిచాడు. మూడో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రాహుల్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక నాలుగవ బంతికి రెండు పరుగులు తీసిన కోహ్లీ, 5 బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను పూర్తి చేశాడు.
 
సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 13 పరుగులే చేయగలిగింది. భారత మ్యాజిక్ బౌలర్ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి.. సీఫెర్ట్ 2 పరుగులు తీయగా..రెండో బంతికి ఫోర్ బాదాడు. మూడో బంతి మళ్లీ 2 పరుగులు తీసిన సీఫెర్ట్ నాలుగో బంతికి ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన మున్రో ఐదో బంతిని బౌండరీకి తరలించి నాలుగు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని.. ఒక్క పరుగుతో సరిపెట్టాడు.
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో కివీస్ 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేయడంతో మ్యాచ్ 'టై' అయింది. దీంతో సూపర్‌ ఓవర్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో 4-0 ఆధిక్యం సాధించింది.

ఫలితంగా కివీస్‌కు నాలుగో ట్వంటీ-20లోనూ పరాభవం తప్పలేదు. ఈ జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ తొలుత టై కాగా, ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. అచ్చం మూడో టీ-20 తరహాలోనే నాలుగో టీ-20 జరిగింది. 
 
ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో కేఎల్ రాహుల్ నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సు ద్వారా కేఎల్ రాహుల్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
 
కేఎల్ రాహుల్ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసిన స్కోర్లు 45, 54, 56, 57 నాటౌట్, 39. ఈ ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ల తర్వాత టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో ఉన్నాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments