Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోతుందా?

ఠాగూర్
శుక్రవారం, 1 నవంబరు 2024 (09:34 IST)
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో కివీస్ చేసిన భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా మూడు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లో మరో మ్యాచ్ మగిలివుండగానే టెస్ట్ సిరీస్‌ను కివీస్ జట్టు కైవసం చేసుకుంది. దీంతో శుక్రవారం నుంచి మంబై వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్ మ్యాచ్‌పై అమితాసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి పరువు నిలుపుకుంటుందా? లేదా టీమిండియా చరిత్రలో ఇప్పటివరకు నమోదుకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. 
 
టీమిండియా ఇప్పటివరకూ స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌ను 0-3తో కోల్పోలేదు. రెండు టెస్టుల సిరీస్‌ను ఒక సారి 0-2తో ఓడిపోయింది. 2000 సంవత్సరంలో దక్షిణాఫిక్రాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో మాత్రమే 0-2తేడాతో ఓటమిపాలైంది. 
 
భారత్‌ ఇప్పటి వరకూ స్వదేశంలో 293 టెస్టులు ఆడింది 120 మ్యాచ్‌లు గెలిచింది. సొంత గడ్డపై ఇన్ని విజయాలు నమోదు చేసిన మూడో జట్టు భారత్‌. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ముందున్నాయి. 
 
టీమిండియా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో విజయాలు - ఓటముల నిష్పత్తి 2.105గా ఉండగా.. ఆస్ట్రేలియా (2.539)  కాస్త మెరుగ్గా ఉంది. స్వదేశంలో ఆడిన 89 సిరీస్‌లలో ఇప్పటివరకూ 18 సిరీస్‌ల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. అయితే మూడు టెస్టుల సిరీస్‌లో ఎప్పుడూ వైట్‌ వాష్‌ కాలేదు.
 
ఒకే సిరీస్‌లో మూడు టెస్టులు టీమ్‌ఇండియా ఓడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న టెస్టు సిరీస్‌లు. చివరి సారిగా 1983లో వెస్టిండీస్‌పై ఆరు టెస్టుల సిరీస్‌లో మూడు టెస్టులు ఓడిపోయింది. ఇపుడు కివీస్ చేతిలో ఈ రికార్డును పునరావృతం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments