Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ చిత్తు... ట్వంటీ-20 సిరీస్ భారత్ కైవసం

ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు మంగళవారం రాత్రి తిరువనంతపురం వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లోనూ కివీస్ ఓడిపోయింది. ఫలితంగా ట్వంటీ-20 సిరీస్‌ను కూడా విరాట్ కోహ్ల

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (09:00 IST)
ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు మంగళవారం రాత్రి తిరువనంతపురం వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లోనూ కివీస్ ఓడిపోయింది. ఫలితంగా ట్వంటీ-20 సిరీస్‌ను కూడా విరాట్ కోహ్లీ సేన కైవసం చేసుకుంది.
 
ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఫలితంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకే కుదించారు. అయితే, ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయాన్ని సొంతంచేసుకుంది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు. తొలి 3 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 18 పరుగులు మాత్రమే చేసింది. టిమ్‌ సౌథీ వేసిన వరుసబంతుల్లో శిఖర్ ధావన్, రోహిత్‌ శర్మ ఔటయ్యారు. వీరిద్దరూ శాట్నర్‌కే క్యాచ్‌ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ.. ఫోర్‌తో జోరుగా కనిపించినా.. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర సోథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 
 
అనంతరం శ్రేయస్‌ (6) సోథీ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. మనీష్ పాండే(17), హార్దిక్ పాండే(14 నాటౌట్) జోడి హిట్టింగ్ చేసినా పెద్దగా పరుగులు చేయలేకపోయింది. చివరి ఓవర్‌లో క్రీజులోకి వచ్చినా ధోనీకి ఒక్క బంతీ ఆడే అవకాశం రాలేదు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌతీ, సోథీ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. బోల్ట్ ఒక వికెట్ తీసుకున్నాడు.
 
ఆ తర్వాత 38 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ నిర్ణీత 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కుమార్ యాదవ్ చెరో వికెట్ తీసుకోగా… బూమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

తర్వాతి కథనం
Show comments