Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో టెస్టు.. శతక్కొట్టిన బ్యాటుకు ముద్దెట్టి.. అనుష్క వైపు..

ఇంగ్లండ్‌ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్టులో భారత్ స్కోర్ పెరిగేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన అద్భుత సెంచరీ చాలా ఉపయోగపడింది.

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (17:22 IST)
ఇంగ్లండ్‌ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ టెస్టులో భారత్ స్కోర్ పెరిగేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన అద్భుత సెంచరీ చాలా ఉపయోగపడింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం విరాట్ సెంచరీ కంటే ఆ తర్వాత అతడు చేసుకున్న సంబరాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. 
 
ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మూడో టెస్టులో మాత్రం టీమిండియా పుంజుకుంది. మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సెంచరీ సాధించాడు. కోహ్లీ కెరీర్‌లో ఇది 23వ టెస్టు సెంచరీ. 
 
ఈ సెంచరీ తర్వాత విరాట్ తనదైన స్టైల్‌లో సంబరాలు జరుపుకున్నారు. తన బ్యాట్‌కు ముద్దుపెట్టుకుని గ్యాలరీలోని భార్య అనుష్క వైపు ఆ బ్యాట్‌ను చూపాడు. దీంతో అనుష్క కూడా తెగ సంబరపడిపోయింది. 
 
అయితే కోహ్లీ గతంలో కూడా ఇలా తన భార్యకు గాల్లో ముద్దులు ఇస్తూ సంబరాలు జరుపుకున్నారు. తాజాగా మరోసారి అలాగే సెంచరీ సంబరాలు జరుపుకోవడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఫ్యాన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments