Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత... మోతేరా టెస్ట్‌కు అరుదైన ఘనత

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (15:21 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, మూడో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మోతేరా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఇందులో భారత్ పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో 4 టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
అయితే, ఈ టెస్ట్ మ్యాచ్‌కు అరుదైన ఘనత ఒకటి లభించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో అతి తక్కువ సమయంలో ఫలితం తేలిన టెస్టుగా చరిత్రపుటలకెక్కింది. మూడో టెస్టు ఫలితం తేలడానికి కేవలం నాలుగు సెషన్ల సమయం మాత్రమే పట్టింది.
 
రెండు రోజుల లోపలే ఇండియా ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది. తద్వారా, రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) తర్వాత పూర్తి చేసిన షార్ట్ టైమ్ టెస్టుగా నిలిచింది. 1946లో వెల్లింగ్టన్లో జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో 145.2 ఓవర్ల పాటు మ్యాచ్ సాగింది. 
 
కానీ, మోతేరా స్టేడియంలో కేవలం 140.2  ఓవర్లు మాత్రమే బౌలింగ్ జరిగింది. తాజా టెస్టులో రెండో రోజు మొత్తం 17 వికెట్లు నేలకూలాయి. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోని వికెట్లను తీశారు. అక్సర్‌కు ఐదు వికెట్లు పడగా, అశ్విన్ నాలుగు, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

తర్వాతి కథనం
Show comments