Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : 3 వికెట్లు కోల్పోయిన భారత్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (15:09 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం మొతేరా స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి పోరాటం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీ మొత్తంలో మంచి ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ శుభమన్ గిల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌లు తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. 
 
వీరిద్దరూ కేవలం 4, 6 చొప్పున పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు రోహిత్ శర్మ కూడా మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫలితంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు ఉన్నారు. ప్రస్తుతం జట్టు స్కోరు 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. 
 
ఇదిలావుంటే, దేశం మొత్తం ఈ మ్యాచ్‌ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఓ సెంటిమెంట్‌ భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అది ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడటమే. అదెలా అంటే..! 13వ ఎడిషన్‌గా జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌లో భారత్‌కు ఇది నాలుగో ఫైనల్‌. 1983, 2003, 2011, 2023లలో టీమిండియా ఫైనల్‌  చేరింది. ఈ నాలుగు పర్యాయాలలో భారత క్రికెట్ జట్టు రెండుసార్లు టీమిండియా టాస్‌ ఓడినా కప్‌ను సొంతం చేసుకుంది. 
 
భారత్‌ తొలిసారి వరల్డ్‌ కప్‌ గెలిచిన 1983లో కపిల్‌ సేన తొలుత టాస్‌ ఓడింది. కానీ ఫైనల్‌లో నాటి అరవీర భయంకర విండీస్‌ను ఓడించింది. అలాగే, 2003లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అదేవిధంగా 2011లో టాస్ ఓడిన భారత్ .. శ్రీలంకను చిత్తు చేసి విజేతగా నిలిచింది. ఇపుడు కూడా భారత్ టాస్ ఓడింది. ఫలితం ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

తర్వాతి కథనం
Show comments