Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెర్త్ టెస్టులో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా... భారత్ ఘన విజయం

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (16:01 IST)
సొంతగడ్డపై ఆస్ట్రేలియన్లకు భారత క్రికెటర్లు కంగారు పెట్టించారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 534 పరుగులు భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
ఆసీస్ ఆటగాళ్లు తమ మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 12-3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించి, మరో ఐదు పరుగులు జోడించి ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ద్వయం కొద్దిసేపు భారత బౌలర్లను నిలువరించింది. ఐదో వికెట్‌కు ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. అయితే, మహ్మద్ సిరాజ్ ఓ అద్భుతమైన బంతితో స్మిత్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌తో కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు.
 
89 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్న హెడ్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపడంతో మార్ష్, హెడ్ నెలకొల్పిన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) వికెట్లను కోల్పోవడంతో ఆసీస్ ఓటమి ఖాయమైంది. చివరికి ఆతిథ్య జట్టు 58.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. 
 
అలాగే వాషింగ్టన్ సుందర్ 2, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్‌‌లో కలిపి 8 వికెట్లతో (మొదటి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3) రాణించిన కెప్టెన్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కాగా, ఈ విజయంతో ఐదు మ్యాచుల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ 0-1తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు వచ్చే నెల 6 నుంచి 10వ తేదీ మధ్య అడిలైడ్ జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టుకు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ఎప్పుడొస్తుందా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అంబటి రాంబాబు (video)

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తర్వాతి కథనం
Show comments