Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ వన్డే : ఆస్ట్రేలియా ఓపెనర్ల వీరకుమ్ముడు.. భారత బౌలర్ల బేజారు

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (12:35 IST)
సిడ్నీ వేదికగా భారత్‌ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య వన్డే సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 
 
ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నారు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇప్పటి వరకు ఐదుగురు బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 25 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. చివరకు డేవిడ్ వార్నర్ 69 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. 
 
ఫించ్ ఖాతాలో అరుదైన రికార్డు 
మరోవైపు, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆర‌న్ ఫించ్ త‌న ఖాతాలో మ‌రో ఘ‌న‌త‌ను వేసుకున్నాడు. వ‌న్డేల్లో అయిదు వేల ప‌రుగులు సాధించిన ఆసీస్ క్రికెట‌ర్‌గా నిలిచాడు. శుక్రవారం సిడ్నీ వేదికగా భార‌త్‌తో ప్రారంభ‌మైన తొలి వ‌న్డేలో ఫించ్ ఆ రికార్డును సాధించాడు. ఫించ్‌కు ఇది 130వ వ‌న్డే. అత‌ని కెరీర్ స‌గ‌టు 40.98గా ఉంది. వ‌న్డేల్లో ఫించ్ మొత్తం 16 సెంచ‌రీలు చేశాడు. వ‌న్డేల్లో 5వేల ప‌రుగుల మైలురాయిని దాటిన ఆసీస్ క్రికెట‌ర్లు చాలా మంది ఉన్నారు.
 
ఆ ప్లేయ‌ర్ల జాబితాలో పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, మార్క్ వా, క్లార్క్‌, స్టీవ్ వా, బేవన్‌, బోర్డ‌ర్‌, హైడెన్‌, జోన్స్‌, బూన్‌, వాట్సాన్‌, హ‌స్సీ, మార్టిన్‌, వార్న‌ర్‌, సైమండ్స్ ఉన్నారు. ఫించ్ కేవ‌లం 126వ ఇన్నింగ్స్‌లో 5వేల ప‌రుగుల మైలురాయిని దాటేశాడు. వార్న‌ర్ ఈ ఘ‌న‌త‌ను కేవ‌లం 115 మ్యాచుల్లోనే అందుకున్నాడు. వ‌న్డేల్లో 5 వేల మార్క్‌ను దాటిన రెండ‌వ ఫాస్టెస్ట్ ఆసీస్ ప్లేయ‌ర్‌గా ఫించ్ నిల‌వ‌డం విశేషం. 
 
కాగా, ఈ సిరీస్‌కు అభిమానుల‌ను కూడా స్టేడియాల్లోకి అనుమ‌తిస్తున్నారు. సిడ్నీలో జ‌రిగే తొలి వ‌న్డేకు 50 శాతం మాత్ర‌మే నిండేలా ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించారు. 9 నెల‌ల త‌ర్వాత టీమిండియా ఆడ‌నున్న తొలి అంత‌ర్జాతీయ సిరీస్ కావ‌డంతో అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. 
 
గత ప‌ర్య‌ట‌న‌లో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచి చ‌రిత్ర సృష్టించిన కోహ్లి సేన.. ఈసారి కూడా అలాంటి అద్భుతం చేస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌కు లేక‌పోవ‌డం కాస్త లోటుగా క‌నిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

అప్రమత్తంగా ఉండండి: సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం, నాశనం చేస్తే చట్టపరమైన చర్యలు

దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకంటే.. పవన్‌పై అలా?

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

తర్వాతి కథనం
Show comments