Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో టెస్టులో అరుదైన ఫీట్: ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించారు..

ఇంగ్లండ్‍‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అరుదైన ఫీట్‌ను సాధించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (14:13 IST)
ఇంగ్లండ్‍‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అరుదైన ఫీట్‌ను సాధించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆటగాడు కరుణ్ నాయర్ శతకం నమోదు చేశాడు. తద్వారా ఈ సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు సాధించారు.
 
1978-79 సీజన్ తరువాత ఒక సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు వ్యక్తిగత సెంచరీలను నమోదు చేయడం ఇదే తొలిసారి. చివరిసారి స్వదేశంలో వెస్టిండీస్‌పై భారత్ ఆ ఘనత సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను నమోదు చేసుకుని కొత్త ఫీట్‌ను అందుకున్నారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాల్గోసారి మాత్రమే.
 
ఇకపోతే.. ఈ మ్యాచ్‌‌‍లో నాయర్ సెంచరీని నమోదు చేయగా, కేఎల్ రాహుల్ కూడా శతకం సాధించాడు. అంతకుముందు మురళీ విజయ్, విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్, పూజారాలు శతకాలు చేసిన వారిలో ఉన్నారు. కాగా, ఈ సిరీస్ లో భారత జట్టు ఇప్పటివరకూ ఎనిమిది శతకాలను సాధించడం మరో విశేషం. ఇందులో విరాట్ కోహ్లి, మురళీ విజయ్‌లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్‌లు సెంచరీలు నమోదు చేసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments